కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో కళాకారులు తమవంతు పాత్ర పోషిస్తున్నారు. జనగామ జిల్లా దేవరుప్పులలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు దుకాణాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు.
అనవసరంగా బయటకొచ్చారో.. యముడే మీ దగ్గరకొస్తాడు - jangon latest news
లాక్డౌన్ నిబంధనలు పాటించాలని...అనవసరంగా బయటకొస్తే కరోనా బారిన పడతారని హెచ్చరిస్తూ సింధు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య అవగాహన కల్పించారు.
![అనవసరంగా బయటకొచ్చారో.. యముడే మీ దగ్గరకొస్తాడు Artists educating the public on Corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6759582-thumbnail-3x2-yama-rk.jpg)
అనవసరంగా బయటకొచ్చారో.. యముడే మీ దగ్గరకొస్తాడు
యుముడు, యమభటుల వేషధారణలో ప్రజలకు కరోనా నుంచి రక్షణ చర్యలను వివరించారు. ఇళ్లల్లోనే ఉండాలని... అత్యవసర సమయంలో బయటకొస్తే నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై రామారావు, కళాకారులు పాల్గొన్నారు.
అనవసరంగా బయటకొచ్చారో.. యముడే మీ దగ్గరకొస్తాడు
ఇదీ చూడండి :వెళ్లలేరు.. ఉండలేరు..
Last Updated : Apr 12, 2020, 12:31 PM IST