తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్రిడ్జి నమూనా మార్చాలంటూ అఖిలపక్ష నిరసన

స్టేషన్ ఘనపూర్ ప్రధాన చౌరస్తాలో నిర్మిస్తున్న బిడ్జి స్వరూపం మార్చాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్ష నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. బ్రిడ్జి నమూనా మార్చి పిల్లర్లతో నిర్మించాలని కోరుతూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వినతి పత్రం అందజేశారు.

Allied leaders protest demanding change of bidji structure
బ్రిడ్జి నమూనా మార్చాలంటూ అఖిలపక్షం నిరసన

By

Published : May 28, 2020, 2:14 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ప్రధాన చౌరస్తా నుంచి బస్ స్టేషన్ వరకు నిర్మిస్తున్న.. బ్రిడ్జి నమూనా మార్చి పిల్లర్లతో నిర్మించాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు స్థానిక శాసనసభ్యులు తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వినతి పత్రం అందజేశారు. బ్రిడ్జి నమూనా మార్పుపై ప్రజల నుంచి సంతకాలు సేకరించారు.

వ్యాపార, వాణిజ్య రంగాలకు లాభం

బ్రిడ్జిని గోడలతో నిర్మిస్తే ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయని అఖిలపక్ష నేతలు వివరించారు. జాతీయ రహదారిపై ఉన్న స్టేషన్ ఘనపూర్ రూపురేఖలు మారుతాయని.. వ్యాపార, వాణిజ్య రంగాలకు లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజలు వ్యాపార సముదాయాలు ఆర్థికంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే బ్రిడ్జి నమూనా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details