జనగామ పట్టణంలోని గిర్నిగడ్డ ప్రాంతానికి చెందిన మేకల వెంకట్(52) ఆదివారం అర్ధరాత్రి బాణాపురం వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి కిందికి వెళ్లాడు. చీకట్లో బురదగుంట కనపడక అందులో బోర్లాపడి.. నీటిలో ఊపిరాడక మృతి చెందాడు. మృతదేహాన్ని సోమవారం సాయంత్రం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రవికుమార్ మృతదేహాన్ని పరిశీలించి.. గిర్నిగడ్డకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో మృతుడికి వివాహం కాలేదని తెలిసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బురదగుంటలో పడి వ్యక్తి మృతి - బురదగుంటలో పడి వ్యక్తి మృతి
జనగామ పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బురదగుంటలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
బురదగుంటలో పడి వ్యక్తి మృతి