తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి తప్పన్నాడని... చింతచెట్టుకు ఉరేసుకున్నాడు! - జనగామ తాజా సమాచారం

తండ్రి మందలించాడని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది.

A young man commits suicide after being reprimanded by his father. The incident took place in the Chilpur zone of Warangal district.
తండ్రి మందలించాడని.. ఓ యువకుడు ఆత్మహత్య

By

Published : Jan 13, 2021, 8:51 PM IST

తండ్రి మందలించాడని మనస్థాపం చెంది.. ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జనగామ జిల్లా చిల్పూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది. ఫతేపూర్ గ్రామానికి చెందిన ఎస్.కె షాహీద్(19) పండ్ల వ్యాపారం చేసేవాడు. ఇటీవల వ్యాపారంలో షాహీద్ నిర్లక్ష్యం వహించాడు. ఈ విషయమై తండ్రి మందలించాడు.

బయటకు వెళ్లి వస్తానని చెప్పి...

తాజాగా నర్మెట అంగడిలో వ్యాపారం కొనసాగిస్తూ.. మధ్యలో బహిర్భూమికని వెళ్లి.. సమీపంలోని చింత చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృత దేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:వ్యవసాయ బావిలో చిరుత.. బయటికి తీసేందుకు విశ్వప్రయత్నం

ABOUT THE AUTHOR

...view details