జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కోతులు ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి అందినకాడికి వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. పండ్ల చెట్లపై గెంతులేస్తూ.. నష్టం కలిగిస్తున్నాయి.
వానరాల బెడదకు కంపతో కళ్లెం!
ఆ ఊరిలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎక్కడైన పండ్ల చెట్లు ఉంటే ఇక అక్కడి నుంచి కదలడం లేదు. అలా చెట్లు పాడవుతున్నాయి. ఓ వ్యక్తి మాత్రం తన ఇంటి పెరటిలోని మామిడి చెట్టును ఎలాగైనా రక్షించుకోవాలని అనుకున్నారు. తనదైన ఉపాయంతో కోతులకు కళ్లెం వేశారు.
వానరాల బెడదకు కంపతో కళ్లెం
వానరాల బెడద నివారణకు నిమ్మల యాదగిరి అనే వ్యక్తి తన ఇంటి పెరట్లోని మామిడి చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలి అనుకున్నారు. చెట్టు నిండా ఇలా రేగు కంపతో నింపేశారు. కంప కారణంగా కోతులు రాకపోవడంతో ఆయన ఉపాయం ఫలించింది.
ఇదీ చదవండి:రిసార్టుల్లో రేవ్ పార్టీలు... మత్తులో చీకటి సయ్యాటలు