జనగామ జిల్లా చిల్పూర్ మండలానికి చెందిన ఓ మహిళా వలసకూలీకి కరోనా వైరస్ సోకింది. ఈమె ఇటీవలే భివండి నుంచి స్వగ్రామానికి రాగా... జ్వరం లక్షణాలు కనిపించాయి. ఈ నెల 14న కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలు చేసేందుకు హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించినట్లు జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో అశోక్‌కుమార్ తెలిపారు.
మరో మహిళా వలస కూలీకి కరోనా పాజిటివ్
జనగామ జిల్లా చిల్పూరు మండలంలో ఓ మహిళా వలస కూలీకి కరోనా నిర్ధరణయ్యింది. బాధితురాలు ఇటీవలే భివండి నుంచి స్వగ్రామానికి వచ్చినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో అశోక్‌కుమార్ తెలిపారు. దీంతో పాటు జిల్లాలో మొత్తం మూడు యాక్టివ్ కేసులున్నట్లు వివరించారు.
మరో మహిళా వలస కూలీకి కరోనా పాజిటివ్
ఇప్పుడు ఆమెకు కొవిడ్ పాజిటివ్ రాగా.. కింగ్ కోఠి ఆసుపత్రిలోనే చికిత్స అందించనున్నట్లు అశోక్‌కుమార్ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం నిడిగొండకు చెందిన ఇద్దరు వలస కూలీలకు కరోనా పాజిటివ్ నమోదు కాగా.. జిల్లాలో ఇది మూడో కేసు అని అశోక్ చెప్పారు.