జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన కృష్ణకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే వల్లమాలిన అభిమానం. అది ఎంత వరకంటే తన ఇంటి ఆవరణలో ఆరడుగుల ఎత్తైన ట్రంప్ విగ్రహం ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహించే అంత. నిత్యం దేవుడికి పూజలు చేయడం మర్చిపోతాడేమో కానీ.. ట్రంపు విగ్రహానికి మాత్రం పూజ చేయడం మరువడు.
ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు - ట్రంప్ తాజా వార్త
దేశంలో రాజకీయ నాయకులను అభిమానించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. అయితే ఓ వ్యక్తి అభిమానం దేశ సరిహద్దులు దాటింది. జీవితంలో కనీసం ఒక్కసారి కూడా చూడని వ్యక్తిని ఆరాధ్య దైవంగా భావించి నిత్యం పూజలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు జనగాంకు చెందిన కృష్ణ.. ఇంతకీ ఎవరిని ఈ అభిమాని అంతగా పూజస్తున్నాడని తెలుసుకోవాలనుకుంటున్నారా..!
ట్రంప్‌కి గుడికట్టి పూజలు చేస్తున్న వీర భక్తుడు
నాలుగు సంవత్సరాలుగా ట్రంప్‌ను ఆరాధిస్తున్న తను సంవత్సరం క్రితం ఏకంగా తన ఇంటి ఆవరణలో ఆరడుగుల ట్రంప్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. నిత్యం విగ్రహానికి పూల, పాలాభిషేకలతో పూజలు నిర్వహిస్తున్నాడు. ఈనెల 24న భారతదేశ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అతని దర్శన భాగ్యం దొరకాలని కృష్ణ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఒకవేళ అదే జరిగితే తన తలనీలాలు ఇస్తానని అంటున్నాడు.
ఇవీ చూడండి:'వారి గాథలు వినడం కాదు... మనమే చరిత్ర సృష్టించాలి