జనగామలో ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. జనగామ పట్టణానికి చెందిన ఒక ఎరువుల దుకాణ యజమానికి కరోనా పాజిటివ్ నిర్ధరణ తెలిసిందే. తాజాగా అతని ప్రైమరీ కాంటాక్ట్ గల 14 మంది నమూనాలు టెస్టులకు పంపగా.. ఏడుగురికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. వారిని హోం ఐసోలేషన్ చేసినట్లు, వారి సన్నిహితులను హోం క్వారెంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
జనగామలో ఒక్కరోజే ఏడు కరోనా పాజిటివ్ కేసులు - కరోనా తాజా వార్తలు
రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా జనగామలో ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
జనగామలో ఒక్కరోజే 7 పాజిటివ్ కేసులు...