జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలోని 14 ప్రాథమిక సంఘాల్లో, 2 సహకార సంఘాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 12 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
జనగామలో 45 శాతం పోలింగ్ నమోదు! - janagama district news today
జనగామ జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 45.07 శాతం పోలింగ్ నమోదైంది.
జనగామలో 45 శాతం పోలింగ్ నమోదు!
మొత్తం 182 మంది డైరెక్టర్లలో 66 మంది ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 116 డైరెక్టర్లకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మందకొడిగా జరిగిన పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకు 45.07% పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :చక్రాల కుర్చీలు లేవు.. మోసే వారుంటేనే ఓటెయ్యగలం..