జనగామ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు బాలురను పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట రహదారి వైపు ఉన్న వడ్లకొండ బైపాస్ రోడ్డు వద్ద ఇద్దరు యువకులు గంజాయి రవాణా చేస్తున్నారు. లింగాల గణపురం మండలం చీటూరు, వడిచర్ల గ్రామాలకు చెందిన నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.
35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
జనగామ జిల్లాలో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 35 ప్యాకెట్ల సరుకును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు.
35 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
అనంతరం 215 గ్రాముల ఎండు గంజాయి గల 35 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్కూటీ, రెండు చరవాణిలను సైతం గుర్తించినట్లు ప్రకటించారు. గంజాయి రవాణాలో ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ స్పష్టం చేశారు.