జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో రాత్రి కురిసిన వర్షానికి చిన్న చిన్న వాగులు, కుంటలు నిండి మత్తడి పోస్తున్నాయి. మండల కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి రాజు అనే రైతు 2 ఎకరాల వరి ధాన్యం కళ్లెంలోనే తడిసిపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటిపాలైందని రైతు బోరుమన్నాడు.
ధాన్యాన్ని తాడిపత్రితో కప్పినప్పటికీ తడిసి ముద్దయిందని ఆందోళన చెందాడు రైతు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరాడు. సుమారు 50 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయిందని..ఈ మేరకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
2 ఎకరాల ధాన్యం వర్షార్పణం..ప్రభుత్వమే దిక్కు ఇక - జనగామ జిల్లా తరిగొప్పుల మండలం
కళ్లెంలో ఆరబోసిన ధాన్యం రాత్రి కురిసిన వర్షానికి జనగామ జిల్లాలో వర్షార్పణం అయ్యింది.
![2 ఎకరాల ధాన్యం వర్షార్పణం..ప్రభుత్వమే దిక్కు ఇక](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4522468-thumbnail-3x2-tadisina.jpg)
ప్రభుత్వమే తమను ఆదుకోవాలని
ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్న రైతు రాజు