జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. 1990- 91 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులు ఆదివారం ఈ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు చదువు నేర్పిన గురువులను సన్మానించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఆనందంతో మురిసిపోయారు.
వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం - Pendyala Government school
వారంతా గతంలో ఒకే దగ్గర కూర్చొని చదువుకున్నారు. అందరూ కలిసి ఆడుకున్నారు. పదో తరగతి అయిపోగానే వారంతా విడిపోయి ఉన్నత చదువులు చదివి.. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. తాము చదువుకున్న రోజులను జ్ఞాపకం చేసుకుంటూ తమకు విద్య నేర్పిన గురువులను సన్మానించేందుకు చదువులమ్మ ఒడిలో సమావేశమయ్యారు.

వేడుకగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం