జగిత్యాల జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశం అధ్యక్షురాలు దావ వసంత అధ్యక్షతన పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యి వివిధ అంశాలపై చర్చించారు.
సంక్షేమ పథకాలను 100శాతం అమలుచేయాలి: మంత్రి కొప్పుల - జగిత్యాలలోని జెడ్పీ సర్వసభ్య సమావేశానికి హాజరైన మంత్రి కొప్పుల
జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో ముందుంజలో ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సంక్షేమ పథకాలను 100శాతం అమలుచేయాలి: మంత్రి కొప్పుల
జిల్లాలోని పలు సమస్యలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. బాధ్యతతో సభ్యులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జగిత్యాల జిల్లా అన్ని రంగాల్లో ముందుంజలో ఉందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను 100శాతం అమలు చేయాలని అధికారులు, ప్రజా ప్రతినిధులను మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఇదే ఒరవడితో ముందుకు సాగాలని సూచించారు.
ఇదీ చూడండి:దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు కుట్ర : తమ్మినేని వీరభద్రం