తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇలాంటి రహస్య జీవోలు ఇంకెన్ని ఉన్నాయో​: షర్మిల

YS Sharmila Comments On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు తెరాస ఎమ్మెల్యేలు నీతిమంతులైతే రాష్ట్రంలోకి సీబీఐ రాకను కేసీఆర్ ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి అన్ని పథకాల్లో కేసీఆర్​ కుటుంబంతో పాటు తెరాస ఎమ్మెల్యేలు అందిన కాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Oct 30, 2022, 9:32 PM IST

YS Sharmila Comments On KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​తో పాటు తెరాస ఎమ్మెల్యేలు నీతిమంతులైతే.. సీబీఐ రాకను ఎందుకు అడ్డుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని వైఎస్సార్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించిన షర్మిల.. కోరుట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని పథకాల్లో కేసీఆర్ కుటుంబంతో పాటు తెరాస ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

సీబీఐ వస్తే అవన్నీ బట్టబయలవుతాయనే భయంతో ముందస్తుగా రాష్ట్రంలోకి సీబీఐ రావొద్దంటూ రహస్య జీవో జారీ చేశారని షర్మిల అన్నారు. ఎప్పుడో జీవోను తీశామని.. దానిని ఇప్పుడు బయటకు తీసి గతంలో జారీ చేశామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి రహస్య జీవోలు ఇంకెన్ని ఉన్నాయో.. ఆ దేవుడికే తెలియాలని ఆమె ఎద్దేవా చేశారు. కేసీఆర్​, తెరాస ఎమ్మెల్యేలు నిజంగానే నీతిమంతులైతే సీబీఐని ఘనంగా రాష్ట్రంలోకి స్వాగతించాలన్నారు.

"తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అన్ని పథకాల్లో కేసీఆర్ కుటుంబంతో పాటు తెరాస ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారు. కేసీఆర్​తో పాటు తెరాస ఎమ్మెల్యేలు నీతిమంతులైతే సీబీఐ రాకను ఎందుకు అడ్డుకుంటున్నారో ముఖ్యమంత్రి చెప్పాలి. సీబీఐ వస్తే అవన్నీ బట్టబయలవుతాయనే భయంతో ముందస్తుగా రాష్ట్రంలోకి సీబీఐ రావద్దంటూ రహస్య జీవో జారీ చేశారు".-వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

కేసీఆర్.. నువ్వు ఏ తప్పుచేయకపోతే సీబీఐకి ఎందుకు భయపడుతున్నావ్​: షర్మిల

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details