జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీలో కొందరు యువకులు కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కరోనాతో మృతి చెందిన తాటిపాముల రామనాధం అనే వ్యక్తి మృతదేహానికి.. ఎనుకందుల రమేశ్, కట్ల నర్సయ్య, ఎలిగేటి సతీశ్, సామల సతీశ్, తాటిపాముల జ్ఞానేశ్వర్ బృందం దహన సంస్కారాలు నిర్వహించింది.
కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తోన్న యువబృందం
కరోనా మహమ్మారి కుంటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నవారు కొవిడ్‌తో మృతి చెందడం వల్ల ఆర్థికంగా ఆ కుటుంబాల జీవనం దుర్భరంగా మారుతోంది. కొవిడ్‌తో చనిపోయిన వారి మృతదేహాన్ని ఖననం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీకి చెందిన కొందరు యువకులు.. మేమున్నామంటూ ముందుకు వచ్చి మానవత్వం చూపుతున్నారు.
raikal municipality, funeral for the corona dead bodies
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కరోనాతో చనిపోయిన వారిని చూసేందుకు కూడా ముందుకు రాని ప్రస్తుత పరిస్థితుల్లో.. ఒక బృందంగా ఏర్పడి యువకులు చేస్తున్న ఈ పనిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: ఇళ్లకు తాళాలు.. రెచ్చిపోతున్న చోరులు!