పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ జగిత్యాల తహసీల్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తోపులాట జరిగింది.
యూత్ కాంగ్రెస్ ధర్నా.. పోలీసులతో తోపులాట - యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా
పెట్రోలు, వంటగ్యాస్ ధరల తగ్గుదలకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. జగిత్యాల తహసీల్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. ధరల నిరంతర పెరుగుదలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెట్రోలు, వంటగ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ ధర్నా
గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల తగ్గుదలకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన తాము.. పెట్రోలు ధరలు తగ్గడం కోసమూ ఉద్యమిస్తామని యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండ మధు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:'రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవరూ బాగుపడలేదు'