Young people attack each other: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గిర్ల గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గ్రామంలో రెండు వినాయక విగ్రహాలను నిమజ్జనానికి మండపాల నిర్వహకులు శోభాయాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒకరి వెనుక ఒకరు శోభాయాత్రకు వెళ్తున్న విషయంలో మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. రెండు మండపాల వారు ఘర్షణ పడుతూ చివరికి కత్తులతో దాడులు చేసుకున్నారు.
వినాయక నిమజ్జనంలో కత్తులతో దాడి చేసుకున్న యువకులు - telanagana crime news
Young people attack each other: అందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకునే వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొంది. జగిత్యాల జిల్లాలో ఓ గ్రామంలో ఒకే రోజు రెండు వినాయక విగ్రహాలు నిమజ్జన కార్యక్రమం నిర్వహించగా మండపాల నిర్వాహకులు శోభయాత్రకు తీసుకెళ్లే విషయంలో మాట మాట పెరిగి చివరికి కత్తులతో దాడి చేసుకొనే పరిస్థితికి వచ్చింది. ఇందులో పలువురికి తీవ్ర గాయలయ్యాయి.
Vinayaka immersion
ఇందులో పలువురికి గాయాలు కావడంతో వెంటనే కోరుట్ల ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరు పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: