జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మఠం హనుమాన్ వార్డుకుచెందిన తోకల ప్రవీణ్ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కరోనా ప్రభావంతో ఉద్యోగానికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో కుటుంబ పోషణ భారమైంది. అయినా ధైర్యంతో ముందుకు వెళ్లాడు. మెట్పల్లిలోని మొదటి వార్డులో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండడంతో.. తనవంతు సాయంగా హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని తీసుకువచ్చాడు. వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి.. పిచికారీ చేశాడు.
ఉద్యోగం కోల్పోయినా... కరోనా వ్యాప్తి కట్టడిలో కృషి చేస్తూ.. - కరోనా వార్తలు
కరోనా కష్టకాలంలో ఉద్యోగం కోల్పోయిన, ఎన్ని కష్టాలు ఉన్నా కాలనీ ప్రజలకు అండగా నిలుస్తున్నాడు ఓ యువకుడు. సొంత ఖర్చులతో హైడ్రో క్లోరైడ్ ద్రావణాన్ని కొని... తాను ఉంటున్న వార్డులో పిచికారీ చేశాడు. కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాడు.
ఉద్యోగం కోల్పోయినా... కరోనా వ్యాప్తి కట్టడిలో కృషి చేస్తూ..
కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ.. అత్యవసరమైతేనే బయటకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. కష్టకాలంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని... ఎవరైనా వచ్చి సాయం చేయాలని కోరాడు.