తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యభిచార రొంపిలోకి మైనర్లు... పోలీసుల అదుపులో నిర్వాహకులు - undefined

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 12 సంవత్సరాల బాలికలతో ఘాతుకానికి పాల్పడుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు దాడులు

By

Published : Apr 28, 2019, 3:25 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా ఇతర ప్రాంతాల నుంచి కొనుక్కుని వచ్చిన నలుగురు బాలికలను పోలీసులు గుర్తించారు. బాలికలకు నకిలీ ఆధార్ కార్డులను సృష్టించినట్లు అధికారులు నిర్ధారించారు. వీరంతా 12 సంవత్సరాల లోపు వారేనని తేల్చారు. ఇక ఐసీడీఎస్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు ఉమ్మడిగా కేసును విచారిస్తున్నారు. నిందితులను రిమాండ్​కు పంపినట్లు స్థానిక ఎస్ఐ లక్ష్మీ బాబు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details