జగిత్యాలలో ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి వీధిపాలు చేసింది. జిల్లాకేంద్రంలోని గణేశ్‌నగర్‌లో ద్యావనపల్లి రమేశ్ దంపతులు ఓ ఇంట్లో అద్దెకుంటున్నారు. భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. ఈ విషయం తెలిసిన ఇంటి యాజమాని వారిని నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించాడు. కట్టుబట్టలతో బయటకు వెళ్లిన వారు దిక్కుతోచని స్థితిలో రోడ్డుపై ఉండాల్సి వచ్చింది.
కరోనా మహమ్మారి కోరలు.. రోడ్డున పడ్డ భార్యాభర్తలు - తెలంగాణ వార్తలు
జగిత్యాలలో కొవిడ్ సోకిన భార్యాభర్తలని అద్దె ఇంటి నుంచి యజమానులు నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయించగా.. దిక్కుతోచని స్థితిలో రోడ్డున పడ్డారు ఆ దంపతులు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన వారిని అధికారులు చేరదీశారు. అంబులెన్సులో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.
భార్యాభర్తలకు కరోనా, దంపతులకు సోకిన కరోనా
సమాచారం అందుకున్న అధికారులు వారిని 108 వాహనంలో కొవిడ్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేయించటంతో తీవ్ర మనోవేదనకు గురయ్యామని బాధితులు వాపోయారు.
ఇదీ చదవండి:తెలంగాణలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది : హర్షవర్ధన్