జగిత్యాల గ్రామీణ మండలం చల్‌గల్‌లో విషాదం చోటుచేసుకుంది. మూడు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందారు. గ్రామానికి చెందిన పందిరి భీమలింగం మూడు రోజుల క్రితం మృతి చెందగా.. అతని భార్య లక్ష్మి ఈ రోజు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
భార్యాభర్తలను బలి తీసుకున్న కరోనా మహమ్మారి - wife and husband died of corona
కరోనా మహమ్మారి భార్యాభర్తలను బలి తీసుకుంది. మూడురోజుల వ్యవధిలోనే ఇద్దరి ఉసురు తీసింది. జగిత్యాల జిల్లాలో చల్‌గల్‌లో ఈ విషాదం చోటుచేసుకుంది.
![భార్యాభర్తలను బలి తీసుకున్న కరోనా మహమ్మారి couples died with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11541183-676-11541183-1619426934715.jpg)
couples died with corona
గ్రామంలో ఇప్పటికే 11 మంది కరోనా సోకి మృతి చెందగా మరో 100 మంది వరకు గ్రామంలో కొవిడ్ సోకి చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య పెరగటంతో గ్రామస్థులు భయందోళనలకు గురవుతున్నారు.
ఇదీ చదవండి:రాష్ట్ర వ్యాప్తంగా 3వేల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులకు కరోనా
Last Updated : Apr 26, 2021, 2:31 PM IST