నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరగడంపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు.
ఈనెల 15న ఈవీఎం తరలింపుపై వార్తలను ప్రచురించిన పాత్రికేయులపై కేసులు పెట్టడాన్ని జీవన్‌రెడ్డి తప్పుపడ్డారు. అది వారి వృత్తి ధర్మమన్నారు. 10 తేదీనే అవగాహన కార్యక్రమాలు పూర్తయితే 15 వరకు ఎందుకు తరలించలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.