తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎస్సారెస్పీలోని నీటిని ఎందుకు తరలించారు' - యూరియా

కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీలోకి నీటిని ఎత్తిపోస్తామని తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్.. దానిలో ఉన్న 4 వేల క్యూసెక్కుల నీటిని ఎందుకు తరలించారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ఎస్సారెస్పీలోని నీటిని ఎందుకు తరలించారు

By

Published : Sep 4, 2019, 7:59 PM IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌..నీటిని ఎందుకు తరలిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జీవన్​రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టులో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. 4 వేల క్యూసెక్కుల నీటిని ఎల్‌ఎండీకి ఎందుకు తరలిస్తున్నారని ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల ఈ ప్రాంత రైతులు ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. వెంటనే నీటి తరలింపు ఆపకపోతే ఆందోళన చేస్తామన్నారు. యూరియా కొరతతో రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

ఎస్సారెస్పీలోని నీటిని ఎందుకు తరలించారు

ABOUT THE AUTHOR

...view details