మొక్క జొన్న పంటకు కత్తెర పురుగుతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. నష్టనివారణ చర్యలపై జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం చింతలపేటలో ఏరువాక కేంద్రం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు.
మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఏంచేయాలంటే..? - కరీంనగర్ ఏరువాక కేంద్రం అధికారుల పర్యటన
మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణపై అవగాహనకు కరీంనగర్ ఏరువాక కేంద్రం అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. జగిత్యాల జిల్లా చింతలపేటలో పర్యటించి.. రైతులను అప్రమత్తం చేశారు.
వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం జగిత్యాల జిల్లాలో సుమారు 20 వేల ఎకరాల్లో మొక్కజొన్నను సాగుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చాలాచోట్ల మొక్కజొన్న పంట రెండో దశలో కత్తెర పురుగుతో పంట దెబ్బతింటోందని కరీంనగర్ ఏరువాక కేంద్రం అధికారులు పేర్కొన్నారు. పంట నష్టం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. తాము సూచించిన విధంగా రైతులు మందుకెళ్లాలని.. అప్పుడే కత్తెర పురుగు నుంచి ఉపసమనం లభిస్తుందని.. మంచి దిగుబడి వస్తుందని పేర్కొన్నారు.
ఇవీచూడండి:గ్రామాభివృద్ధికి కేటాయించిన నిధులకు లెక్కలు తప్పాయి!