తెలంగాణ

telangana

ETV Bharat / state

భగీరథ పైపు లీకులమయం.. ఆ గ్రామం అతలాకుతలం

మిషన్ భగీరథ పైపులైన్ పగలడం వల్ల జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారులోని వెంకట్రావుపేట గ్రామం అతలాకుతలమయింది. గంటపాటు సాగిన నీటి లీకేజీతో ఆ ప్రాంతమంతా నీటితో నిండిపోయింది.

By

Published : Dec 15, 2020, 10:02 AM IST

water wastage due to pipeline damage in jagtial
భగీరథ పైపు లీకులమయం..

జగిత్యాల జిల్లా మెట్​పల్లి శివారులోని వెంకట్రావుపేట వద్ద మిషన్ భగీరథ మెయిన్ పైప్​లైన్ పగిలిపోయి ఆ ఊరంతా అతలాకుతలమయింది. తెల్లవారుజామున పైపు పగలడం వల్ల ఎవరూ గమనించలేదు. సుమారు గంటపాటు నీరు లీకవ్వడం వల్ల పక్కనే ఉన్న రెండు ఇళ్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. విగ్రహాల తయారీ కేంద్రంలోకి నీరు చేరి విగ్రహాలు కొట్టుకుపోయాయి.

ఇంటి ముందు నిలిచిన భగీరథ నీరు

నీటి ఉద్ధృతిలో కొట్టుకుపోయిన ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. పక్కనే ఉన్న ఇంట్లోకి నీరు చేరి సామగ్రి అంతా తడిచిపోయింది. నీటి ప్రవాహ ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల ఇంటి రేకులు పేకి లేచాయి.

నీటిలో పడి కొట్టుకుపోయిన మహిళ
ఇంట్లోకి చేరిన నీరు

సమాచారం అందుకున్న అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. డబ్బా వాటర్ గ్రిడ్ నుంచి వేసిన మెయిన్ పైపులైన్ తరచూ లీకవుతుండటం వల్ల నీరంతా వృధాగా పోవడమే కాకుండా.. తమకు ఇబ్బంది కలిగిస్తోందని స్థానికులు అధికారులకు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీటి ఉద్ధృతితో నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details