తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న మిషన్​ భగీరథ నీరు - తెలంగాణ వార్తలు

మిషన్ భగీరథ పైప్‌లైన్‌ తరుచూ ఎక్కడో ఒకచోట లీకేజీ అవుతూనే ఉంది. ఫలితంగా తాగునీరు వృథాగా పోతోంది. కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల ముందు పైప్‌లైన్ పగిలి... నీరు వృథాగా పోతూ ఫౌంటెన్‌ను తలపిస్తోంది.

wastage-of-drinking-water-look-like-fountain-due-to-mission-bhagiratha-pipeline-leakage
ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న తాగునీరు

By

Published : Jan 27, 2021, 1:11 PM IST

ఫౌంటేన్‌లా ఎగిసిపడుతున్న తాగునీరు

జగిత్యాల జిల్లా కోరుట్ల పాలిటెక్నిక్ కళాశాల ముందు మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ అయింది. నీటి ఒత్తిడి వల్ల తాగునీరు ఫౌంటేన్‌లా ఎగిసి పడుతోంది. జాతీయ రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని.. భగీరథ పైప్‌లైన్‌లో లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:పదోన్నతులపై సందేహాలు... జాబితాపై స్పష్టతేది?

ABOUT THE AUTHOR

...view details