జగిత్యాల జిల్లా మెట్పల్లిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముగ్గుల పోటీ నిర్వహించారు. ఓ వైపు పండుగ విశిష్టతను తెలుపుతూనే.. మరోవైపు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు.
సంక్రాంతి ముగ్గులతో ఓటరు అవగాహన - voter awarenes at metpally
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో వినూత్నంగా ఓటరు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించేలా విద్యార్థులు ఆసక్తికరమైన రంగవల్లులు వేశారు.
సంక్రాంతి ముగ్గులతో ఓటరు అవగాహన
అందమైన సంక్రాంతి ముగ్గులు వేసి వాటి చుట్టూ ఓటరు అవగాహన కల్పించేలా వివిధ సూక్తులు రాశారు. ఓటర్లలో మార్పు తెచ్చేందుకు విద్యార్థులు చేసిన కృషిని అధ్యాపకులు అభినందించారు.