జగిత్యాల జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్ మండలాలతో పాటు పలు పురపాలక సంఘాల పాలకవర్గాలు లాక్డౌన్ అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయి. పల్లెల్లో కొవిడ్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నందున ముందస్తు చర్యలుగా లాక్డౌన్ విధానం పాటిస్తున్నారు.
జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో స్వచ్ఛంద లాక్డౌన్
కొవిడ్ ఉగ్రరూపం దాల్చుతున్నందున జగిత్యాల జిల్లాలోని పలు పురపాలక సంఘాల పాలకవర్గాలు... లాక్డౌన్ పాటించేందుకు తీర్మానం చేశాయి. స్వచ్ఛంద లాక్డౌన్ వల్ల రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
telangana news
గ్రామాల్లో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దుకాణాలు మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచినప్పటికీ జన సంచారం అంతంతమాత్రంగానే ఉంది. అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావడం లేదు. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఆక్సిజన్ కొరతను అధిగమిస్తాం: మంత్రి గంగుల