తెలంగాణ

telangana

ETV Bharat / state

మానవత్వం చాటుకున్న ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ - ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ వార్తలు

రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ మానవత్వాన్ని చాటుకున్నారు. ద్విచక్రవాహనంపై నుంచి కిందిపడిన వ్యక్తికి సాయం చేసి... క్షతగాత్రుణ్ని ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

vinod kumar helped to injured person
మానవత్వం చాటుకున్న ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

By

Published : Jun 6, 2021, 7:16 PM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ మానవత్వం చాటుకున్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తుండగా.. మల్యాల వద్ద జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో పని చేసే ఎర్రం హరిచరణ్‌ అనే ఉద్యోగి ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయి సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.

అతన్ని గుర్తించిన వినోద్‌కుమార్‌ కారును ఆపి ఆయనే స్వయంగా 108 వాహనానికి ఫోన్‌ చేశారు. అతనికి వైద్యసేవలు అందించాలని వైద్యాధికారులను కోరారు. వెంటనే అతన్ని 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి: Telangana Cabinet: ఎల్లుండి రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details