తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం - jagityala

జగిత్యాల జిల్లా రాఘవపేటలో వెంకటేశ్వరస్వామి కల్యాణం కన్నులపండువగా జరిగింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

కన్నుల పండువగా కల్యాణం

By

Published : Mar 18, 2019, 2:33 PM IST

Updated : Mar 18, 2019, 5:58 PM IST

కన్నుల పండువగా కల్యాణం
జగిత్యాల జిల్లా రాఘవపేటలో వెంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను గత మూడురోజులుగా కన్నుల పండువగా నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఊరేగించారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి కల్యాణాన్ని జరిపించారు.

పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే...

ఈ వేడుకకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు కుటుంబసమేతంగా హాజరయ్యారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి కల్యాణాన్ని తిలకించి అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు.
Last Updated : Mar 18, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details