జగిత్యాల జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో వాహన పూజలు నిర్వహిస్తున్నారు. విజయదశమి రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవని భక్తుల విశ్వాసం. అందుకే ఆనవాయితీగా ఇక్కడ వాహన పూజలు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు. కొత్తగా తీసుకున్న వాహనాలకు సైతం ఈ రోజు పూజలు చేస్తున్నారు. వాహన పూజల కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విజయదశమి సందర్భంగా కొండగట్టులో వాహన పూజలు - Jagityala district latest news
విజయదశమి సందర్భంగా కొండగట్టులో వాహన పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
విజయదశమి సందర్బంగా కొండగట్టులో వాహన పూజలు