వర్షాలు సమృద్ధిగా కురవాలని.. పంటలు బాగా పండాలని జగిత్యాల జిల్లా ధర్మపురిలో వరుణ యాగాన్ని నిర్వహించారు. ధర్మపురిలోని రామలింగేశ్వరస్వామి ఆలయం, కోటేశ్వరస్వామి ఆలయంలో 108 కళశాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ ఆదేశాల మేరకు యాగం పూర్తి చేసి పూర్ణాహుతి జరిపించారు. రాష్ట్రంలో వానలు బాగా కురిసి... పాడి పంటలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని భక్తులు కోరుకున్నారు.
వర్షాల కోసం ధర్మపురిలో వరుణ యాగం - undefined
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలోని ఆలయాల్లో వరుణ యాగాన్ని నిర్వహించారు. వర్షాలు కురవాలని కోరుతూ 108 కళశాలతో అభిషేకించి పూర్ణాహుతి జరిపించారు.

ధర్మపురిలో వరుణ యాగం
TAGGED:
varuna yaagam in dharmapuri