జనతా కర్ఫ్యూకు ముందు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన 58 మంది యాత్రికులు ఎట్టకేలకు జగిత్యాలకు చేరుకున్నారు. గత 50 రోజలుగా అక్కడే చిక్కుకుపోగా.. అక్కడి ప్రభుత్వం వారికి భోజనం, వసతి ఏర్పాటు చేసింది. అందరూ వృద్ధులు కావటం వల్ల తీవ్ర అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు రెండు ప్రభుత్వాలు వారిని స్వస్థలాలకు చేర్చేందుకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయటం వల్ల.. ప్రత్యేక బస్సులో జగిత్యాలకు చేరుకున్నారు.
శివుడి కటాక్షం.. జగిత్యాలకు యాత్రికుల బృందం - Varanasi
లాక్డౌన్ కారణంగా వారణాసిలో చిక్కుకున్న జిల్లాకు చెందిన 50 మంది యాత్రికులు ఎట్టకేలకు జగిత్యాలకు చేరుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ వీరికి స్వాగతం పలికి.. యోగక్షేమాలను తెలుసుకున్నారు.
జగిత్యాలకు చేరుకున్న వారణాసి యాత్రికులు
వారికి జగిత్యాలలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ స్వాగతం పలికారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మజ్జిగ ప్యాకెట్లను అందించారు. ఇల్లు చేరటం వల్ల యాత్రికులు సంతోషం వ్యక్తం చేశారు.