జగిత్యాల జిల్లా మెట్పల్లిలో క్షయ వ్యాధి నిర్ధారణపై వైద్యులు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో క్షయ వ్యాధి నివారణ జిల్లా అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. వ్యాధి పట్ల ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని.. ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని శ్రీనివాస్ తెలిపారు. ఈ వ్యాధిని మందుల ద్వారా తగ్గించుకోవచ్చని సూచించారు. క్షయ పట్ల ఏమాత్రం అలసత్వం వహించిన చాలా ప్రమాదమన్నారు. అనంతరం పలువురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందించారు. ఈ అవగాహన సదస్సులో పట్టణంతో పాటు పలు గ్రామాల నుంచి ప్రజలు హాజరయ్యారు.
"క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి"
క్షయ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి శ్రీనివాస్ తెలిపారు. మెట్పల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పలువురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి మందులను అందించారు.
క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి