తెలంగాణ

telangana

ETV Bharat / state

Farmers Crop Loss: రైతులపై వరుణుడు పంజా.. మునుపెన్నడూ లేని విధంగా

Crop Damaged in Jagtial District: వరుణుడు రైతులపై మళ్లీ పంజా విసిరాడు. భారీగా కురిసిన వర్షంతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. కళ్లముందే ధాన్యం కొట్టుకుపోయి అపార నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Farmers Crop Loss
Farmers Crop Loss

By

Published : May 1, 2023, 1:19 PM IST

Updated : May 1, 2023, 2:52 PM IST

రైతులపై వరుణుడు పంజా.. మునుపెన్నడూ లేని విధంగా

Crop Damaged in Jagtial District: అకాల వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఎండకి అరబెడుతుండగా.. అవి ఆరేలోపే మళ్లీ వర్షం పడుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అన్నదాతల కళ్లముందే వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే వడగళ్లతో చేలలోనే ఉన్న పంట నష్టపోగా.. ఇప్పుడు రాత్రి మళ్లీ కురిసిన వర్షంతో కల్లాల్లో ఉన్న ధాన్యమంతా నీటిలో కొట్టుకుపోయింది.

నీళ్లల్లో తెలియాడుతున్న కల్లాల్లోని ధాన్యం రాశులు: జగిత్యాల జిల్లాలో 10 రోజులుగా కురుస్తున్న వర్షానికి ఇప్పటికే కర్షకులు నష్టాల్లో మునిగి తేలగా.. నిన్న రాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కల్లాల్లో ఉన్న ధాన్యం రాశులు కాస్త నీళ్లలో తెలియాడుతున్నాయి. నీటి ప్రవాహనికి కొట్టుకుపోయి ధాన్యం ఎత్తుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో వెల్గటూరులో అత్యధికంగా.. 83 మిల్లీ మీటర్ల వర్ష కురవగా బుగ్గారం, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, జగిత్యాల, మల్యాల, కొడిమ్యాల, సారంగపూర్‌ మండలాల్లో భారీ వర్షం కురిసింది.

అకాల వర్షం.. రైతులకు కూలీల ఖర్చు కూడా దక్కే పరిస్థితి లేదు: మునుపెన్నడూ లేని విధంగా నష్టం వాటిల్లిందని.. అధికారులు ఒక గింజ కొనలేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కోయాల్సిన వరి పంట రాలిపోయి.. కూలీల ఖర్చు కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మామిడి, నువ్వు పంట దెబ్బతినగ తాజాగా రాత్రి కురిసిన వర్షానికి మూలిగే నక్క మీద తాడిపండు పడ్డ చందంగా రైతుల పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ఈ తడిచిన ధాన్యం ప్రభుత్వ కొనుగోలు చేసి ఎలాగైనా కర్షకులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

గత వారం రోజుల నుంచి అకాల వర్షాల కారణంగా వరి పొలం మొత్తం దెబ్బతింది. పంట కోసిన వారి కల్లాల్లో అయితే ధాన్యం నీళ్లల్లో తెలియాడుతుంది. నీళ్లను ఏ విధంగా మళ్లించాలో అర్థంగాక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా రెండు మూడు రోజుల పాటు ఇలాగే వర్షం కురిసే అవకాశం ఉందంటున్నారు. మరీ మా పరిస్థితి ఏంటి..? ప్రభుత్వం ఎలాగైనా రైతుల దగ్గరనుంచి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నాం. -రైతు

నాకు ఉన్న భూమిలో కొంత కోశాను. ఇంకా కొంత కోయ్యాల్సి ఉంది. ఈ అకాల వర్షాల కారణంగా చేలోని పంట వడ్లు మొత్తం రాలిపోయాయి. కోసిన ధాన్యం చూస్తే.. ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో ఎండకు ఆరబెట్టడానికి కూడా లేకుండా పోయింది. ఇక్కడ ధాన్యానికి మొక్కలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరుతున్నాను. -రైతు

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details