శ్రీ వికారినామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లి అభయహస్త హనుమాన్ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయంలో హనుమాన్ దీక్ష పరులు హనుమాన్ చాలీసా, దండకం చదివారు. మహా హరతినిచ్చి... ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఉగాది సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు - హనుమాన్ చాలీసా
ఉగాది పండుగ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పచ్చడిని ఆలయ కమిటీలు భక్తులకు అందించారు.
స్వామివారికి ప్రత్యేక పూజలు