తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్ని ప్రభుత్వాలొచ్చినా... మా బతుకులు మారడం లేదు' - farmers protest demanding minimum support price for turmeric

పసుపుకు మద్దతు ధర ప్రకటించాలంటూ జగిత్యాల రైతు ఐక్యవేదిక ఆందోళన బాట పట్టింది. మెట్​పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి అధికారికి వినతిపత్రం అందించి తమ సమస్యలు వివరించారు.

turmeric farmers demand minimum support price for turmeric at metpally in jagtial district
'ఎన్ని ప్రభుత్వాలొచ్చినా... మా బతుకులు మారడం లేదు'

By

Published : Feb 10, 2020, 5:42 PM IST

'ఎన్ని ప్రభుత్వాలొచ్చినా... మా బతుకులు మారడం లేదు'

ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడితో పసుపు సాగు చేస్తే పెట్టుబడి పైసలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు మద్దతు ధర క్వింటాకు రూ.15,000 ప్రకటించాలని జగిత్యాల జిల్లా కర్షకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

ఎన్ని ప్రభుత్వాలు మారినా... పసుపు రైతుల బతుకులు మాత్రం మారడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన సుగంధ ద్రవ్యాల బోర్డుతో ఒరిగేదేం లేదని, చేతికొచ్చిన పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details