తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో భారీ వర్షం.. తడిసిన పసుపు - jagityala district latest news

రైతు పరిస్థితి నానాటికి దిగజారుతోంది. ఎండనక.. వాననక.. రాత్రనక.. పగలనక కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. మార్కెట్​కు తీసుకొచ్చిన పసుపు వర్షానికి తడిసి ముద్దయింది.

Turmeric Drenched with rain at metpally
మెట్​పల్లిలో భారీ వర్షం.. తడిసిన పసుపు

By

Published : Mar 12, 2020, 7:28 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్​లో ఉన్న పసుపు తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డ్​లో ఉన్న ఒక్క కాల్వ మూసుకుపోవడంతో వర్షం నీరు బయటకు వెళ్లలేక పసుపు కుప్పల వద్దే నిలిచి పోయింది. పసుపు పంటను కాపాడుకునేందుకు అన్నదాతలు పారిశుద్ధ్య కార్మికులుగా మారారు. మురుగు కాల్వను శుభ్రం చేసుకొని వర్షపు నీటిని బయటకు తరలించారు.

తడిసిన పసుపును కొనుగోలు చేయండి..

ఇంత చేసి పంటను కాపాడుకున్నా మద్దతు ధర లేకపోవడం వల్ల కర్షకులు ఆవేదనకు గురవుతున్నారు. తడిసిన పసుపును కొనుగోలు చేయాలని రైతులు మార్కెట్ కార్యాలయానికి తరలొచ్చారు. కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల జాతీయ రహదారిపై ధర్నా చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న మార్కెట్ సూపర్​ వైజర్ రమణ రైతుల వద్దకు వచ్చి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

మెట్​పల్లిలో భారీ వర్షం.. తడిసిన పసుపు

ఇవీ చూడండి:9 నెలల్లో రూ.1.08 లక్షల కోట్లు విలువైన ఔషధ ఎగుమతులు

ABOUT THE AUTHOR

...view details