తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రయాణికురాలి దీక్ష - జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె

జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దితిచ్చింది ఓ ప్రయాణికురాలు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రయాణికురాలి దీక్ష

By

Published : Nov 12, 2019, 3:36 PM IST

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు పట్టణంలోని డిపో ముందు ఆర్టీసీ కార్మికులు నిరాహార దీక్షకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి మద్దతుగా ఈ రోజు బస్సులో ప్రయాణించే సైదమ్మ అనే ప్రయాణికురాలు సంఘీభావం తెలుపుతూ దీక్షలో కూర్చుంది.

రోజూ ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణం ఇబ్బందిగా ఉందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులతో చర్చలు జరిపి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరింది.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ప్రయాణికురాలి దీక్ష

ఇవీ చూడండి: అమ్మభాషలో చదువుకో... ఆంగ్లమూ నేర్చుకో!

ABOUT THE AUTHOR

...view details