తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 45వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. అందులో భాగంగానే జగిత్యాల డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చొని భిక్షాటన చేస్తూ తమ నిరసనను తెలిపారు. 45 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ... ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. రెండు నెలలుగా జీతాలు లేకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను చర్చలకు పిలిసి... సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు - మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు వినూత్న రీతిలో తమ నిరసనను వ్యక్తం చేశారు. మోకాళ్లపై కూర్చోని భిక్షమెత్తుకున్నారు.

మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు
మోకాళ్లపై కూర్చొని భిక్షమెత్తుకున్న ఆర్టీసీ కార్మికులు
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు