ఆర్టీసీ సమ్మె విరమిస్తున్నట్లు ఐకాస ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ముందస్తు జాగ్రత్తగా ఆర్టీసీ కార్మికులను ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఆర్టీసీ డిపో వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు లోనికి రాకుండా డిపో గేటుకు తాళం వేసి ఉంచారు. తాత్కాలిక ఉద్యోగులను కూడా లోనికి రాకుండా బయటనే ఉంచారు.
కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి అరెస్ట్లు - మెట్పల్లి కార్మికులను ఇళ్ల నుంచి పీఎస్కు తరలింపు
ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని ఐకాస ఇచ్చిన పిలుపు మేరకు పోలీసులు ముందుస్తు అరెస్ట్లు చేస్తున్నారు. కార్మికుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
కార్మికులను ఇళ్ల నుంచి పీఎస్కు తరలింపు