తెలంగాణ

telangana

ETV Bharat / state

తల కిందికి.. కాళ్లు పైకి.. ఆర్టీసీ కార్మికుడి వినూత్న నిరసన

జగిత్యాల జిల్లాలో ఓ ఆర్టీసీ కార్మికుడు తలకిందులుగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ప్రభుత్వ పాలన కూడా ఇలాగే ఉందని తెలిపాడు.

తల కిందికి.. కాళ్లు పైకి.. ఆర్టీసీ కార్మికుడి నిరసన

By

Published : Nov 8, 2019, 12:48 PM IST

డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె నేటికీ 35వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి ఆర్టీసీ డిపో వద్ద ఐకాస ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు.

బస్​డిపో ముందు కార్మికులు ధర్నా నిర్వహించీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆనంద్​ అనే కార్మికుడు తలకిందులుగా నిలబడి నిరసన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం కూడా పాలనను తలకిందులుగా పాలిస్తోందని.. అందుకే ఈ విధంగా నిరసన చేస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరపాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

తల కిందికి.. కాళ్లు పైకి.. ఆర్టీసీ కార్మికుడి నిరసన

ఇదీ చదవండిః మెస్మరైజ్ చేసిన మిస్ ఫెమినా సుందరి

ABOUT THE AUTHOR

...view details