మెట్పల్లిలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ మెట్పల్లిలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
మెట్పల్లిలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాన రోడ్డుపై ఆందోళన నిర్వహించడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
Last Updated : Oct 15, 2019, 4:59 PM IST