తెలంగాణ

telangana

ETV Bharat / state

జగిత్యాల జిల్లా పురపాలికలు తెరాసవే..! - తెలంగాణ మున్సిపల్​ ఎన్నికల పోలింగ్

జగిత్యాల జిల్లా పురపాలికల్లో తెరాస విజయ ఢంకా మోగించింది. ఐదు మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు దక్కించుకొని గులాబీ జెండా ఎగరవేసింది. పురపీఠం దక్కించుకుంది.

జగిత్యాల జిల్లా పురపాలికల్లో గులాబీ జెండా
జగిత్యాల జిల్లా పురపాలికల్లో గులాబీ జెండా

By

Published : Jan 25, 2020, 8:35 PM IST

Updated : Jan 25, 2020, 11:31 PM IST

జగిత్యాల పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. ఈ జిల్లాలో 48 వార్డులు ఉండగా.. 30స్థానాల్లో కారు గుర్తు అభ్యర్థులు జయభేరి మోగించారు. కాంగ్రెస్​ 7 వార్డులు దక్కించుకోగా.. భాజపా 3 కైవసం చేసుకుంది. ఇతరులు ఏడు స్థానాల్లో గెలుపొందగా.. మజ్లిస్​ ఒక స్థానంతో సరిపెట్టుకుంది.

జగిత్యాల జిల్లా పురపాలికల్లో గులాబీ జెండా

కోరుట్లలో కూడా గులాబీ గుబాళించింది. ఇక్కడ 33 వార్డులకు గాను 21 వార్డుల్లో గెలుపొందిన తెరాస.. పురపీఠాన్ని దక్కించుకుంది. కాంగ్రెస్​ 2 స్థానాలు గెలుచుకుంటే 5 వార్డుల్లో కమలం వికసించింది. అలాగే ఎంఐఎం పార్టీ​ 2, ఇతరులు 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. మెట్‌పల్లి మున్సిపాలిటీలో తెరాసదే హవా కొనసాగింది. మొత్తం 26 వార్డులకు 16 సాధించింది అధికార పార్టీ. భాజపా నాలుగు స్థానాలు గెలుచుకోగా 3 వార్డులు హస్తగతమయ్యాయి. ఇతరులు కూడా మూడు వార్డులు దక్కించుకున్నారు.

రాయికల్‌లో 12 వార్డులకు గాను.. తెరాస 9 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. కాంగ్రెస్​, భాజపా, ఇతరులు చెరో ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు. ధర్మపురి పురపాలికను అధికార పార్టీ కైవసం చేసుకుంది. ధర్మపురిలో 15 వార్డులుంటే తెరాస 8 గెలుచుకోగా 7 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చింది.

ఇవీ చూడండి: కారు జోరు.. తెలంగాణభవన్​లో కార్యకర్తల ఊపు..

Last Updated : Jan 25, 2020, 11:31 PM IST

ABOUT THE AUTHOR

...view details