నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత గెలుపుతో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో తెరాస సీనియర్ నాయకుడు పుల్ల జగన్‌గౌడ్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
కల్వకుంట్ల కవిత విజయం.. తెరాస శ్రేణుల సంబురం - nizamabad mlc byelection 2020
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కల్వకుంట్ల కవిత విజయం సాధించడంపై తెరాస శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో సంబురాలు చేసుకున్నారు.
కల్వకుంట్ల కవిత విజయం
అనంతరం గ్రామకూడలి వద్ద మిఠాయిలు పంచారు. కల్వకుంట్ల కవిత గెలుపు నిజామాబాద్ తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని జగన్‌గౌడ్ అన్నారు.
- ఇదీ చూడండి :నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం