జగిత్యాల జిల్లా మెట్పల్లి జాతీయ రహదారిపై 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఎస్సారెస్పీ వంతెనకు అధికారులు మరమ్మతులు చేపట్టడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు కదలక ప్రయాణికులు, ప్రజలు నానా అవస్థలు పడ్డారు. పోలీసులు జోక్యం చేసుకొని పనులు జరుగుతుండగానే... ఓవైపు నుంచి మెల్లిగా వాహనాలను పంపించారు. వంతెన మరమ్మతు పనులు సుమారు 15 రోజుల పాటు ఉంటాయని జాతీయ రహదారి అధికారులు తెలిపారు.
ఎస్సారెస్పీ కాలువ పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం - ఎస్సారెస్పీ కాలువ పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం
జగిత్యాల జిల్లా మెట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న ఎస్సారెస్పీ వంతెనకు మరమ్మతులు చేపట్టడం వల్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.
ఎస్సారెస్పీ కాలువ పనుల వల్ల ట్రాఫిక్ అంతరాయం