రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టంతో వేలాది మందికి లబ్ధి చేకూరుతుందని మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ ఛైర్మన్ బాపూరెడ్డి అన్నారు. రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో ఐదు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేశారు. ర్యాలీను కలికోట నుంచి బాపూరెడ్డి ప్రారంభించగా కథలాపూర్ వరకు భారీ ర్యాలీని విజయవంతం చేశారు.
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ 500 ట్రాక్టర్లతో ర్యాలీ - jagityal district ltest news
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ఐదు వందల ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయగా మార్క్ఫెడ్ రాష్ట్ర మాజీ ఛైర్మన్ బాపూరెడ్డి ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ చట్టం ద్వారా రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని బాపూరెడ్డి అన్నారు.
![రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ 500 ట్రాక్టర్లతో ర్యాలీ jagityal farmers accepting new revenue act](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8879572-730-8879572-1600674839584.jpg)
రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ 500 ట్రాక్టర్లతో ర్యాలీ
ర్యాలీ మధ్యలో వరద కాలువల వద్ద ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి.. ఆయనకు ప్రత్యేక పూజలు చేశారు. ఏళ్ల తరబడి భూ సమస్యలతో ఎదుర్కొంటున్న అన్నదాతలకు నూతన రెవెన్యూ చట్టం.. ఓ వరం లాంటిదని బాపూరెడ్డి అభిప్రాయపడ్డారు. సీఎం కృషితో త్వరలోనే బంగారు తెలంగాణ సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చే నీటిని అందుకుని అన్నదాతలు.. వారికి నచ్చిన పంటలు పండిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిఃకొవిడ్ ఆందోళనలకు సమీక్షతోనే పరిష్కారం!