వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేపడుతోన్న రైతులను కేంద్రం ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాని అన్నారు.
రైతులపై కేంద్రానిది ద్వంద వైఖరి: మాజీ మంత్రి పొన్నం - జగిత్యాల జిల్లా తాజా వార్తలు
రైతు ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాని ఆక్షేపించారు.
![రైతులపై కేంద్రానిది ద్వంద వైఖరి: మాజీ మంత్రి పొన్నం tpcc working president ponnam elligation on central government for farmers is a duplicitous attitude](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10567635-1087-10567635-1612940470572.jpg)
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ప్రజాస్వామ్య పద్దతిలో 80 రోజులుగా నిరసన తెలుపుతూ.. 150 మంది అన్నదాతలు మరణించినప్పటికి కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక వైపు రైతులతో చర్చలు జరుపుతున్నామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం మరోవైపు ఉద్యమం చేసేవారు రైతులే కాదని వ్యాఖ్యానించడం వారి ద్వంద వైఖరికి నిదర్శనమని తెలిపారు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది డిసెంబర్లో జరిగిన భారత్ బంద్‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్ దిల్లీకి వెళ్లొచ్చిన తర్వాత మాట మార్చారని పొన్నం ఆరోపించారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఆ తర్వాత తమ సత్తా ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.
ఇదీ చదవండి:చర్లపల్లి జైలుకు కోయిలమ్మ సీరియల్ హీరో