Godavari Tourism in Jagtial: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వీవీ రావుపేట గ్రామ శివారులో దక్షిణ గంగ అని పిలిచే గోదావరి నది సందర్శకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. శ్రీరాంసాగర్ నుంచి భారీగా వరద నీటిని వదలడంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. పచ్చటి చెట్లు చల్లని గాలి ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నదీ మార్గంలో రాళ్ల మధ్య నుంచి జలజలమని పారుతున్న గోదావరి నది శబ్దాలు వినడానికి కంటికి ఇంపుగా ఉన్నాయి.
గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగం.. తరలివస్తున్న పర్యాటకులు - తెలంగాణ తాజా వార్తలు
Godavari Tourism in Jagtial: జగిత్యాలలో గోదావరి నది సందర్శకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తోంది. శ్రీరాంసాగర్ నుంచి భారీగా వరద నీటిని వదలడంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. గోదావరి ప్రాంతాన్ని తిలకించేందుకు సాయంత్రం వేళలో సందర్శకులు వచ్చి సేద తీరుతున్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Etv Bharat
గోదావరి నది ప్రవాహ ప్రాంతాన్ని చూసేందుకు సాయంత్రం వేళలో సందర్శకులు వచ్చి సేద తీరుతున్నారు. ప్రతీ సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శకులు ఎక్కువగా వీక్షించడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆర్ధికంగా మా ప్రాంతాన్ని బలోపేతం చేయాలని, సందర్శకులకు కావలసిన కనీస వసతులు అందేలా ప్రధాన్యత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 14, 2022, 12:47 PM IST