తెలంగాణ

telangana

ETV Bharat / state

బతికుండగానే సమాధి నిర్మాణం.. కొడుకులు శ్రమ పడకుండా నిర్ణయం - Tomb construction while alive

మరణించిన తర్వాత తన కుమారులు శ్రమ పడకుండా..తాను బతికుండగానే సమాధిని నిర్మించుకున్నాడు ఓ వృద్ధుడు. ఎంత సంపాదించినా చివరకు చేరేది ఆరడుగుల గోతిలోనేనని, అందుకే సమాధి నిర్మించుకున్నట్లు తెలిపాడు.

grave, tomb, tomb construction while alive
సమాధి, బతికుండగానే సమాధి, కొత్తగూడెం

By

Published : Apr 8, 2021, 8:17 AM IST

గిత్యాల జిల్లా గ్రామీణ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన నక్క ఇంద్రయ్య తాను బతికుండగానే సమాధిని నిర్మించుకున్నారు. 75 ఏళ్ల ఇంద్రయ్య 20 ఏళ్ల కిందటే ఈ సమాధి నిర్మించుకోగా ఆయన భార్య గతంలో మృతి చెందగా ఈ సమాధి పక్కనే మరో సమాధి నిర్మించారు. రెండు సమాధులనూ రాతి నిర్మాణంతో పూర్తి చేశారు.

ఎంత సంపాదించినా చివరికి చేరేది ఇక్కడికే గనుక సమాధి నిర్మించుకున్నట్లు ఇంద్రయ్య తెలిపారు. తన కుమారులు శ్రమ పడకుండా కేవలం తన మృతదేహాన్ని బండ తీసి పెడితే సరిపోతుందన్నారు. బుధవారం సమాధి వద్దకు వచ్చిన ఇంద్రయ్య తన శాశ్వత నిలయంలో పెరిగిన పిచ్చి మొక్కలను శుభ్రం చేసుకుని కాసేపు సేదతీరి వెళ్లారు.

ABOUT THE AUTHOR

...view details